Monday, December 4, 2023

పునరారంభం...

ఏన్నో కారాణాల వలన సాహితి మీకు నిరంతరాయంగా సాహిత్యాన్ని అందించటం కలిగిన అంతరాయానికి చింతిస్తూ... త్వరలో నిరంతరం చదివే అవకాశం కలిగించాలన్న లక్ష్యంతో... సాహితి పునరారంభం...

Sunday, December 10, 2017

కవిత - అమృతభాష నా మాతృభాష



అమృతభాష నా మాతృభాష
-
-డా.డాక్టర్ బషీర్, చెన్నపట్టణం

కాదు ఇది ఓ అక్షరాల మూట
పదాల తేట, వాక్యాల చాట
కానే కాదు పుస్తకాల వేట
అలంకారాల దుర్భేద్యపు కోట
కాకూడదు ఆశల, అడియాసల, సయ్యాట
అసూయ నిరాశల కాలిబాట
కావాలి అది అనుభవాల పూదోట
మానవతా పరిమళాలు వెదజల్లాలి అచ్చోట
అవినాభావాల రక్తసంబంధాల ఊట
స్నేహానురాగాల భావాల తేట
యువత భవిత గమ్యానికి బాట
కుమ్మరిస్తున్నవి సిరులన్నియు ఓచోట
ముక్కోటి భావాల హృదయాల ఆట
భావాల, మోహాల, స్నేహాల, బంధాల
పదాలై, వాక్యాలై, గీతికలై, శ్లోకాలై
భాషాభిమానుల, సేవకుల, ప్రేమికుల
విశాల హృదయాలపై కవి పండితుల
జిహ్వలపై నర్తిస్తున్నాయి
అందరి పెదవులపై
మధురానుభూతులను చిలికిస్తున్నాయి
కలకాలం ఇది పండాలి
అందరినోట ముత్యాల మూట
భూదేవి హృద్వీణ పాట
నా మాతృభాష, నా తల్లిభాష
అమ్మపాల కమ్మని భాష
కోటి వీణల సలలిత రాగ సుధారస పాట
లోక కల్యాణానికి ఓ తపస్సు
ఎన్నటికీ తరగని ఉషస్సు
భావావేశాల మేధస్సుల తేజస్సు
నా అమృతభాష నా మాతృభాష
అమరభాష, సమరభాష, సమరసభాష

Tuesday, October 21, 2014

నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటు

నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటు
నేటి ఆంధ్రజ్యోతి (అనంతపురం జిల్లా ఎడిషన్) లో విజయసోపానం శీర్షికన ప్రచురితమైన స్టోరీ మొదటి వాక్యంలోనే పెద్ద పొరపాటుండి పోయింది.  నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాననటం పెద్ద పొరపాటు.  నేను ఐ.టీ.ఐ. లో చేరటానికి దారితీసిన పరిస్థితులు వేరు.  నేను చదివిన రోజుల్లో గణితంలో శతాంకం సాధించికూడా ఆ సంవత్సరం కెమిస్ట్రీలో ఎందరో ఫెయిల్ కాగా నేను మాత్రం అన్ని సబ్జెక్ట్ లో తగినన్ని మార్కులతో ఇంటర్ పాసయ్యాను. ఇంటర్ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నేను ఆశించినట్లు ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్.సీ. సీటు లభించకపోవటం వలన ఐ.టీ.ఐ. లో కంప్యూటర్ కోర్సు చేరదలచి అప్లై చేస్తే అదీ లభించక డీసెల్ మెకానిక్ కోర్సు ప్రథమ శ్రేణి లో  ఉత్తీర్ణత సాధించాక మళ్ళీ ప్రయత్నించినా నేను ఆశించినట్లు ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్.సీ. సీటు లభించకపోవటం వలన (ప్రైవేటు కళాశాల లో సీటు లభించినా ఆర్థిక కారణాల వల్ల (ఎక్కువ ఫీసు చెల్లించలేని స్థితి కారణంగా)  ప్రభుత్వ కళాశాలలోనే బీ.కాం. లో చేరి మొదటి సంవత్సరంలో ప్రథమ శ్రేణి సాధించినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో ఆర్.టీ.సీ. లో అప్రెంటిస్ గా అవకాశం లభించటంతో అటువైపు పెద్దల మక్కువ వలన మెకానిక్ - అప్రెంటిస్ గా చేరినప్పటికీ తదుపరి ఏ.పీ.ఎస్. ఆర్.టీ.సీ. లో రెగ్యులర్ ఉద్యోగం లభించినా చేరకుండా హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వహించి అదే దిశలో పై స్థాయిలో అధ్యాపక ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం దిశగా ఒక వైపు డిస్టెన్స్ ద్వారా చదువులు కొనసాగిస్తూనే పోటీ పరీక్షల రాయడం ద్వారా లభించిన అవకాశాల్ని చేజారనివ్వకుండా ఆశించినట్లుగా విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యాపక సేవలందిచాలన్న అభిరుచి దిశగా పట్టుదలతో కృషిచేయటంతో సాధించగలిగాను.
ఇంటర్ ఫేలయి సప్లిమెంటరీ పరీక్షలో పాసయి ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశమే ఉండదు.  ఈ విషయం కూడా పాఠకులకు (ముఖ్యంగా ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాని ఆశించే విద్యార్ధులకు) తెలపటం అవసరం.  అప్పుడే సరియైన దిశలో వాళ్లు ప్రయత్నించగలరు.  నాకు పోటీ పరీక్షల రాయడం ద్వారా మరెన్నో ఉద్యోగాలు లభించినప్పటికీ నా ప్రవృత్తికి తగిన ఉద్యోగమే చేయాలన్న లక్ష్యం దిశగా వాటిని స్వీకరించలేదు.  అటువంటి వాటిలో ఇటీవల వచ్చిన ఒక పెద్ద అవకాశాన్ని కూడా కాదను కున్నాను, అది ప్రభుత్వరంగ బ్యాంకులో జనరల్ మేనేజర్ ఉద్యోగం.  ఈ నిజాలు పాఠకులకు ప్రేరణాదాయకంగా ఉండగలవనిపిస్తే ఆంధ్రజ్యోతి లో రిజాయిండర్ ను ప్రచురించడం శ్రేయస్కరంగా భావిస్తున్నాను.  ఇవన్ని విషయాలూ కాక పోయినా నేను ఇంటర్ ఫెలయ్యానన్న విషయం ప్రచురించటం అవసరం. (ముఖ్యంగా ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాని ఆశించే విద్యార్ధులకు) తెలవాల్సిన అవసరం ఉంది. Consistent Educational Back Ground ఉండటం అవసరమనే విషయం వారికి తెలిస్తే విజయసోపానం దిశగా పయనించగలరు. ఆంధ్రజ్యోతి లో విజయసోపానం శీర్షిక ఉద్దేశం కూడా అదే అనుకుంటాను.


Courtesy:- Andhra Jyothy E-Paper

Thursday, April 11, 2013

ఉగాది కవితలు


విజయ నామ ఉగాది శుభాకాంక్షలతో...

ఉగాది
- మాస్టర్ సి. విజయేంద్రబాబు

వచ్చింది మన నవ వసంతం
వచ్చింది మన ఉగాది
కొత్తగా కాసిన మామిడి పిందెల
మధ్య కోయిలలు కుఊ కుఊ పాడాయి
వచ్చింది చైత్రమాసం
వచ్చింది మన ఉగాది
కొత్తగా కాసిన వేప పువ్వుల మధ్య
వచ్చింది మన వసంత ఋతువు
వచ్చింది మన ఉగాది
ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు
షడ్రుచులతో ఉగాది పచ్చడి
జీవితాల్లో కష్ట-సుఖాలను, కలిమి, లేమిని, ఆనంద-భాగ్యాలను గుర్తుచేసింది
వచ్చింది మన నవ వసంతం
చైత్ర, వైశాక, జ్యేష్ఠాలు
ఆశాడ, భాద్రపద
ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర
పుష్య, మాగ, పాల్గునం
తరువాత వచ్చే నవ వసంతం
అదే మన తెలుగు నవవత్సరం
అదే మన ఉగాది.
00000

యుగమునకు ఆరంభం
- డాక్టర్. ఎస్. పద్మప్రియ

యుగమునకు ఆరంభం ఉగాది
చేకటి వెలుగుల కలయిక యే జీవితం
ఘనీభవించిన చీకటి చూసి భయపడకు
ఆగురా తప్పక తెలవారుతుంది
వచ్చింది రా నవ వసంతం

000000000000

ఉగాదికి ఈ మా ఆహ్వానం

- డాక్టర్ వి. విజయలక్ష్మి

ఒక చిన్న వాడు కోరిన కోరిక కు ప్రతిరూపం
ఉగాదికి ఈ మా ఆహ్వానం
ఉగాది కాదిది యుగాది
రాబోయే యుగాది అందరి ప్రగతికి నాంది కావాలని
వసంత ఋతువుని గుర్తు చేసే కోయిల కూత
అందరిమనసుల్లో ఉగాది వసంతాలు నింపాలని
ఉగాదికి ఇదే మా ఆహ్వానం
ఇవే ఉగాది శుభాకాంక్షలు.
000

విజయనామ ఉగాది శుభాకాంక్షలు

సాహితి పాఠకులకు విజయనామ ఉగాది శుభాకాంక్షలు.  
గత కొంతకాలంగా అనివార్యకారణాల వల్ల సాహితి నిష్క్రియకు చింతిస్తూ నేటినుండి నిరంతరం రచనలతో సాహితి పునః ఎప్పటిలా కొనసాగుతుందని తెలుపుతూ.. విజయనామ సంవత్సరంలో మన సత్సంకల్పాలన్నింటికీ విజయం చేకూరాలని కోరుకుంటూ...

Tuesday, August 28, 2012

ఉత్తమ ఉపాధ్యాయుల కుండవలసిన లక్షణాలు...


ఆర్యులారా! నమస్సులు.
వచ్చే నెల ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవము జరుగబోతోంది కదండీ! అందుకని మంచి ఉపాధ్యాయులను గౌరవించటం ద్వారా గురువుల యెడ మనకు కలిగిన గౌరవ భావాన్ని చాటటం మన కనీస కర్తవ్యంగా భావిస్తున్నాను. అంతే కాదు. 
ఎందరో సహృదయులైన ఉపాధ్యాయులు తాము ఉత్తమ ఉపాధ్యాయులుగా మెలగుట కొఱకు సహృదయులు సూచించే మార్గదర్శకాలను అనుసరించుట కొఱకు ఎదురు చూస్తున్నారు. సహృదయులైన మీరు ఉత్తమ ఉపాధ్యాయుల కుండవలసిన లక్షణాలుగా భావించే అంశాలను వ్యాసాల రూపంలో సూచిస్తే అవి మన "ఆంధ్రామృతం" బ్లాగులో ప్రచురింపబడటం ద్వారా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచ గలనని మనవి చేస్తున్నాను. 
అంతే కాదు. మీ హృదయాన్ని తమ అసాధారణ సత్ప్రవర్తనతో దోచుకున్న ఉత్తమ ఉపాధ్యాయులెవరైనా ఉన్నట్లైతే తప్పక వారి ఛాయా చిత్రంతో పాటు వారి విజయ పరంపరను కూడా వివరంగా పంప వలసినదిగా కోరుచున్నాను.
అవకాశం ఉంటే ఈ క్రింది యూఆరెల్ తెరచి చదవండి.
ఇట్లు 
బుధజన విధేయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.